సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (16:42 IST)

ఆనం వివేకానంద రెడ్డి ఆరోగ్యం విషమం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన కృత్రిమశ్వాసపై జీవిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన కృత్రిమశ్వాసపై జీవిస్తున్నారు. 
 
నిజానికి ఆనం వివేకానంద రెడ్డి కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. 
 
ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందిస్తున్నామని చంద్రబాబుకు కిమ్స్‌ వైద్యులు వివరించారు. 
 
అయితే, ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోగా మరింత క్షీణించినట్టు ఆస్పత్రి వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై జీవిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించినట్టు తెలుస్తోంది.