బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: గురువారం, 30 నవంబరు 2017 (21:16 IST)

ఆయన మాకు బాగా కావాల్సినంత... ఆనం వివేకా ఫైర్

కాంగ్రెస్ హయాంలో నెల్లూరు జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన ఆనం బ్రదర్స్ హవా ప్రస్తుతం తగ్గిపోయింది. నెల్లూరు జిల్లాలో ఆనం బ్రదర్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ ఫ్యామిలీ బాగా సుపరిచితమే. ఆనం రాంనారాయణరెడ్డి ఉమ్మడి ర

కాంగ్రెస్ హయాంలో నెల్లూరు జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన ఆనం బ్రదర్స్ హవా ప్రస్తుతం తగ్గిపోయింది. నెల్లూరు జిల్లాలో ఆనం బ్రదర్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ ఫ్యామిలీ బాగా సుపరిచితమే. ఆనం రాంనారాయణరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖామంత్రిగా పనిచేయగా, ఆనం వివేకానంద రెడ్డి కూడా కీలక వ్యక్తిగా పార్టీలో ఉన్నారు.
 
అయితే వీరిద్దరిలో ఆనం రాంనారాయణరెడ్డికి సున్నిత వ్యక్తి అని పేరుంది. వివేకానంద రెడ్డికి మాత్రం మాస్ ఫాలోయింగ్ బాగా ఉంది. తన హావభావాలు, సెటైర్లు, విచిత్ర వేషధారణలతో ఆనం వివేకానందరెడ్డి ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. అలాంటి వీరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అధికార తెలుగుదేశం పార్టీలో ఈ బ్రదర్స్ చేరేటప్పుడు వివేకాకు ఎమ్మెల్యే, రాంనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని బాబు హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది.
 
అయితే వాటి వూసే లేదు. దీంతో ఆనం బ్రదర్స్ టిడిపి అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. మొదట్లో వీరు వైఎస్ఆర్‌సిపిలోకి వెళతారని ప్రచారం జరిగినా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇద్దరిని బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. అయితే స్థానికంగా ఉన్న టిడిపి నేతలు జిల్లాలో జరిగే కార్యక్రమాలకు అసలు ఆనం బ్రదర్స్‌ను పిలవడం లేదు. దీంతో మంత్రి అమరనాథ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు ఆనం బ్రదర్స్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు వివేకానంద రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
 
మమ్మల్ని మీరు నాయకులుగా చూడటం లేదు. పార్టీ మారి తప్పు చేశా, నమ్మించి బాగా మోసం చేశారు.. నెల్లూరు జిల్లాలో అసలేం జరుగుతుందో మీరు మాకు చెప్పడంలేదంటూ ఫైరయ్యారట ఆనం వివేకాంద రెడ్డి. దీంతో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలో తెలియక అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.