మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 మార్చి 2018 (14:42 IST)

నెల్లూరు సోగ్గాడికి ఏమైంది?

నెల్లూరు జిల్లా సోగ్గాడిగా రాజకీయ నేత ఆనం వివేకానంద రెడ్డి గుర్తింపుపొందారు. ఈయన ఏది చేసినా సంచలనమే. మురికివాడలో పర్యటించినా తన పంథానే వేరంటారు. హిజ్రాలతో కలిసి డాన్సులు వేయడం మొదలుకుని ప్రజా సమస్యల ప

నెల్లూరు జిల్లా సోగ్గాడిగా రాజకీయ నేత ఆనం వివేకానంద రెడ్డి గుర్తింపుపొందారు. ఈయన ఏది చేసినా సంచలనమే. మురికివాడలో పర్యటించినా తన పంథానే వేరంటారు. హిజ్రాలతో కలిసి డాన్సులు వేయడం మొదలుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులపై మండిపడటం వరకు.. అంతా సంచలనమే. 
 
అలాంటి నెల్లూరు సోగ్గాడు గత కొన్నిరోజులుగా బయట ఎక్కడా కనిపించడం లేదు. చివరకు మీడియా కంటికి కూడా చిక్కడం లేదు. దీనికి కారణం.. ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఈ కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 
 
ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు.