శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 15 జనవరి 2018 (12:29 IST)

నిమ్మరసం తాగితే ఎంత మేలో తెలుసా?

ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే అది కాలేయానికి టానిక్‌గా పనిచేసి, పైత్యరసాల ఉత్పత్తిని పెంచుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగై, పలురకాల అంటురోగాల నుండి మనల్ని రక్షిస్తుంది

ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే అది కాలేయానికి టానిక్‌గా పనిచేసి, పైత్యరసాల ఉత్పత్తిని పెంచుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగై, పలురకాల అంటురోగాల నుండి మనల్ని రక్షిస్తుంది. గొంతునొప్పి, ఆస్మా ఇబ్బందుల నుండి ఉపశమనం ఇచ్చే గుణం నిమ్మకుంది. 
 
నిమ్మ కాయను దివ్యౌషధంగా పేర్కొంటారు. నిమ్మకాయ రసం నీటిలో లేదా మజ్జిగలో పిండుకుని తాగటం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తాగితే బరువు తగ్గొచ్చు. ఇంకా ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే ఇమ్యూనిటీ పెరుగుతుంది. నిమ్మలోని సిట్రిక్‌యాసిడ్‌తో జీర్ణశక్తి చురుకవుతుంది. పంటినొప్పికి చక్కటి విరుగుడుగా నిమ్మరసం పనిచేస్తుంది. 
 
అలాగే క్యాన్సర్‌ కారకాలను నియంత్రిస్తుంది. నేత్ర సమస్యలను నివారిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో నిమ్మరసం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.