ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 9 జనవరి 2018 (09:15 IST)

గర్భనిరోధకాలతో ఎయిడ్స్.. డీఎంపీఏను వాడితే? (video)

మహిళలు గర్భ నిరోధక ఇంజెక్షన్లు వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని ఆపేయండి. లేకుంటే ప్రాణాంతక వ్యాధి హెచ్ఐవీ సోకే ప్రమాదం వుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా గర్భనిరోధక సాధనాలతోనే హెచ్ఐవీ సోకే ప్రమ

మహిళలు గర్భ నిరోధక ఇంజెక్షన్లు వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని ఆపేయండి. లేకుంటే ప్రాణాంతక వ్యాధి హెచ్ఐవీ సోకే ప్రమాదం వుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా గర్భనిరోధక సాధనాలతోనే హెచ్ఐవీ సోకే ప్రమాదం చాలావరకు వుందని పరిశోధనలో తేలింది. సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలోని మహిళలు ''డిపాట్-మెడ్రాక్సీప్రొజెస్టిరాన్ అసిటేట్ (డీఎంపీఏ)"ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. 
 
ఇవి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఇంకా రోగ నిరోధక వ్యవస్థను కూడా దెబ్బతీస్తాయి. దీంతో జననాంగం వద్ద రక్షణగా ఉండే పొరను ప్రభావరహితంగా మారుస్తుందని, ఫలితంగా హెచ్ఐవీ సోకే ముప్పు అపాయం వుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుచేత డీఎంపీకు బదులుగా వేరు మార్గాన్ని ఎంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. 
 
గర్భాన్ని నిరోధించేందుకు ఇంజెక్షన్ రూపంలో డీఎంపీఏను మూడు నెలలకోసారి తీసుకుంటూ వుంటారని.. అయితే ఈ ఔషధాన్ని వినియోగించే మహిళల్లో హెచ్ఐవీ ముప్పు 40 శాతం పెరిగినట్టు అధ్యయనంలో తేలిందని పరిశోధకులు తేల్చారు.