సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2017 (13:19 IST)

వాజ్‌పేయికి రాష్ట్రపతి, మోదీ, చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

భారతరత్న, బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆయనకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతితో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ

భారతరత్న, బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆయనకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతితో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వాజ్‌పేయి నివాసానికి వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లడించారు. వీరితో పాటు కేంద్ర మంత్రులతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు అందజేశారు. వాజ్‌పేయి పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 
 
గౌరవనీయులైన అటల్ జీ జన్మదిన శుభాకాంక్షలంటూ కామెంట్ చేశారు. దార్శనికత, ముందుచూపుతో వ్యవహరించి దేశాభివృద్ధికి పాటుపడ్డారని, అంతర్జాతీయంగానూ భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేశారని కొనియాడారు. అటల్ జీకి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ట్విట్టర్లో ఆకాంక్షించారు. గౌరవనీయులు, అత్యంత ప్రజాదరణ పొందిన శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
 
అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా అటల్ బిహారీ వాజ్‌పేయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వాజ్‌పేయి గొప్ప దార్శనికుడు అని కొనియాడారు. మంగళగిరి వద్ద ఎయిమ్స్‌కు ఆయన పేరును సూచించింది తానేనని బాబు పేర్కొన్నారు. వాజ్‌పేయి పాలనాదక్షుడని, పండితుడు, కవి అని ప్రశంసలు కితాబిచ్చారు.