శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (09:37 IST)

రాహుల్ గాంధీపై చెయ్యేసి సెల్ఫీ తీసుకున్న యువతి.. బీజేపీకి షాక్ తప్పదు.. (వీడియో)

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. గుజ‌రాత్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ రాక కోసం భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా బ‌రూచ్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. గుజ‌రాత్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ రాక కోసం భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా బ‌రూచ్‌లో రాహుల్ గాంధీ ప్ర‌చారానికి వెళ్లారు. అక్కడ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఉన్నట్టుండి.. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న వాహనంపైకి ఓ యువతి ఎక్కేసింది.
 
అయితే రాహుల్ గాంధీ ఆ యువతిని ఏమీ అనకుండా కామ్‌గా వుండిపోయారు. వాహ‌నంపైకి ఎక్కిన‌ ఆమె రాహుల్ గాంధీపై చేయి వేసి ఫొటో దిగాల‌ని చూసింది. ఆ త‌రువాత స్మార్ట్‌ఫోన్ తీసుకుని సెల్ఫీ దిగింది. అనంత‌రం రాహుల్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి దిగిపోయింది. 
 
మరోవైపు బరూచ్‌లోని ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. గుజరాత్‌ ఎన్నికల పోలింగ్ రోజున బీజేపీ కరెంట్ షాక్ కొడుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విరుచుపడ్డారు. భారతదేశం ''ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్''లో గత ఏడాది కన్నా 30 ర్యాంకులు ఎగబాకి 100వ ర్యాంకును సాధించినట్లు విడుదలైన నివేదికలో మనదేశం 130వ స్థానంలో వుందన్నారు. మనదేశంలో వ్యాపారం చేయడం సులువు కాదన్నారు. 
 
మన దేశంలో వ్యాపారం చేయడం సులువు కాదని, పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ తీవ్ర నష్టం కలిగించాయని చెప్పారు. ఈ పరిణామాలు క్షేత్ర స్థాయి వాస్తవాలను మార్చలేదన్నారు. మోదీ నవంబరు 8న రూ.500, రూ.1,000 నోట్లను నవ్వుతూ రద్దు చేశారు. రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులను దెబ్బతీశారన్నారు. ఆర్థిక వ్యవస్థను దిగజార్చారన్నారు. అది చాలదన్నట్లు జీఎస్‌టీని అమలు చేశారన్నారు. గుజరాతీయులతో పాటు, యావద్దేశ ప్రజలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారన్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.