సంబంధిత వార్తలు
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2020: ఈ మహమ్మారి ఏడాదిలో నర్సులు, మంత్రసానిల కృషిపై WHO
- భారత్లో 2 - 3 దశల్లో కరోనా వైరస్ వుంది.. : ఎయిమ్స్ డైరెక్టర్
- ఆంధ్రాలో కరోనా కేసులకు బ్రేక్ పడినట్టేనా? 12 గంటల్లో ఒక్క కేసు..
- ప్రియుడిని కలుసుకోవాలి పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్.. ఠాణా ముందు బైఠాయించిన యువతి
- గర్భిణిని కాటేసిన కరోనా వైరస్.. నిండు గర్భిణి బలి
కరోనా మహమ్మారితో ఏపీలో వ్యక్తి మృతి.. 304కు చేరిన పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారితో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటి వరకూ ఏపీలో కరోనాతో నలుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, కర్నూలులో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరింది. అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 74 కేసులు నమోదయ్యాయి.
మొత్తం కేసుల్లో సగం కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోవే కావడం గమనార్హం. 24 గంటల వ్యవధిలో 45 కేసుల నమోదవ్వడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది.
తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 3న మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తాజాగా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మంగళవారం నాడు మీడియా బులెటిన్‌లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
