1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Pawan Kalyan Janasena Party Tweet Deleted immediately

పవన్ కళ్యాణ్‌వి పిల్ల చేష్టలా..? ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారా?

సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాల్లో ఏది చేసినా చెల్లుబాటవుతుంటుంది. ఆట్టే పెద్దగా పట్టించుకోరు. కానీ రాజకీయాల ద్వారా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టేవారి విషయంలో మాత్రం జనం బాగా గమనిస్తుంటారు. తాజాగా పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్ చూసిన

Pawan Kalyan
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాల్లో ఏది చేసినా చెల్లుబాటవుతుంటుంది. ఆట్టే పెద్దగా పట్టించుకోరు. కానీ రాజకీయాల ద్వారా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టేవారి విషయంలో మాత్రం జనం బాగా గమనిస్తుంటారు. తాజాగా పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్ చూసినవారు పవన్ కళ్యాణ్ లో పిల్ల చేష్టలు ఇంకా వున్నాయా అనే కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం వుంది. 
 
ఐతే ఇప్పుడే ఆ ఎన్నికలపై జనసేన మాట్లాడటం పక్కనపెడితే ఆ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామంటూ ట్వీట్ చేయడంతో అంతా నొసలు ఎగరేశారు. ఎవరో ఏదో అనుకుంటూ, చర్చించుకుంటూ వుంటారు కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత త్వరగా తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీనితో జనసేన ట్వీట్ పైన ట్వీట్ల మోత మోగింది. 
 
ఏమనుకున్నారో కానీ ఆ ట్వీటును డిలిట్ చేశారు. కానీ ట్వీట్ చూసిన జనం మాత్రం పవన్ పిల్ల చేష్టల్లాగా వున్నాయంటూ చెప్పుకుని కిసుక్కుమంటూ నవ్వుకుంటున్నారట. మరి పార్టీ ప్రకటన విషయంలో ఇకపై జనసేన జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రకటలు ఇస్తే బెటరేమో?
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
తిరుమలలో దారుణం - పసిబిడ్డను చంపి బాత్‌రూంలో పడేశారు