ఓ మై గాడ్.. లాస్ వెగాస్ కోసం ప్రార్థిస్తున్నా : హీరో నిఖిల్ ట్వీట్
అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఉన్న ఓ సంగీత విభావరిలో కాల్పులు చోటుకుని 20 మంది మృత్యువాతపడ్డారు. మరో వంద మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై టాలీవుడ్ హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఉన్న ఓ సంగీత విభావరిలో కాల్పులు చోటుకుని 20 మంది మృత్యువాతపడ్డారు. మరో వంద మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై టాలీవుడ్ హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. "ఓ మై గాడ్. ఎప్పుడూ సంతోషంగా ఉండే నగరంలో ఇలా జరగడం భావ్యం కాదు. అమాయక ప్రజలపై ఉన్మాదంతో కాల్పులకు తెగబడుతున్న రాక్షసులను అడ్డుకుని, వారిని కఠినంగా శిక్షించాలి. వందలాది రౌండ్ల తూటాలు పేలాయి. సంగీత విభావరికి వెళ్లినవారు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం భయం గుప్పిట్లో బతుకుతోంది. మన నగరాల్లో ఇలాంటివి జరగకూడదు. చాలా బాధాకరం లాస్ వెగాస్ లో ఉన్న అందరికోసం ప్రార్థిస్తున్నా" అంటూ ట్వీట్ చేశాడు.
కాగా, అమెరికాలోని లాస్‌వెగాస్ స్ట్రిప్‌లో సంగీత విభావరి జరుగుతుండగా ఓ సాయుధుడు కాల్పులతో తెగబడ్డాడు. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. సంగీత విభావరి జరుగుతున్న మాండలై బే హోటల్‌లో సాయుధుడు ఒక్కసారిగా కాల్పలకు తెగబడటంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని సాయుధుడిని కాల్చిచంపినట్టు అధికారులు తెలిపారు