1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Police Stopped TDP MLA Balakrishna Vechile

బాలయ్యను అడ్డుకున్న ఖాకీలు - మా జోలికొస్తే తిరగబడతామంటూ వార్నింగ్

Nandamuri Balakrishna
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామంలో బాలయ్య ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 
 
ఇక్కడ మూడు రోజుల క్రితం జాతర జరిగింది. ఆ సమయంలో వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. వైకాపా కార్యకర్తల దాడిలో టీడీపీ కార్యకర్త గాయపడ్డాడు. అతన్ని పరామర్శించేందుకు బాలయ్య ఆ గ్రామానికి వచ్చారు. 
 
కానీ, బాలయ్యను ఆ గ్రామానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు పోలీసులు దిగివచ్చి మొత్తం కాన్వాయ్‌ను కాకుండా, కేవలం బాలయ్య వాహనాన్ని మాత్రమే గ్రామంలోకి వెళ్లనిచ్చారు. 
 
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, గ్రామాలో పగలు, ప్రతీకారాలు రేపే విధంగా వైకాపా నేతలు, కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నామన్నారు. మరోమారు తమ కార్యకర్తల జోలికి వస్తే తిరగబడతామని హెచ్చరించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
వరంగల్ చౌరస్తాలోని రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం