మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (14:07 IST)

పెంపుడు కుక్క కోసం స్టేడియం ఖాళీ చేయించిన ఐఏఎస్‌కు పనిష్మెంట్!

dog walk
తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేసేందుకు స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్ జంటపై కేంద్ర హోం శాఖ కన్నెర్రజేసింది. వారిద్దరినీ అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో తలోదిక్కుకు బదిలీ చేసింది. దీనిపై నెటిజన్లు తమకు తోసిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఢిల్లీ రెవెన్యూ శాఖ కార్యదర్శిగా సంజీవ్ ఖిర్వార్ పని చేస్తున్నారు. ఈయన భార్య రింకూ దుగ్గా కూడా ఐఏఎస్ అధికారి. వీరిద్దరూ 1994 బ్యాచ్‌కు చెందిన అధికారులు. వీరిద్దరూ ఢిల్లీలో పనిచేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఈ జంట తమ పెంపుడు కుక్కతో కలిసి ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంకు ఇటీవల ఒక రోజు సాయంత్రం వచ్చారు. వీరి రాకతో స్టేడియంను ముందే ఖాళీ చేసి వెళ్లిపోవాలని అక్కడున్న అథ్లెట్లు, కోచ్‌లను సిబ్బంది కోరారు. సాయంత్రం 7 గంటల్లోపు వెళ్ళిపోవాలని ఆదేశించారు. ఆ తర్వాత ఖాళీ చేసిన చేసిన స్టేడియంలో ఈ దంపతులు తమ పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేశారు. వీరిద్దరూ పెంపుడు కుక్కతో కలిసి నడుస్తున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయింది. దీనిపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నుంచి ఓ నివేదిక తెప్పించుకుంది. ఆ తర్వాత సంజీవ్ ఖిర్వార్‌ను, ఆయన భార్య రింకూ దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఐఏఎస్ దంపతులను తలో దిక్కుకు పంపిస్తే వారు పెంచుకునే కుక్క పరిస్థితి ఏం కాను? అని ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఇపుడు ఎవరు వాకింగ్‌కు తీసుకెళతారు? కుక్క లడఖ్ వెళ్లాలా? లేక అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాలా? అంటూ వ్యంగ్యంగా ప్రశఅనలు సంధిస్తున్నారు.