శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మే 2022 (13:20 IST)

జపాన్‌లో కుక్కలా మారిన మనిషి - రూ.12 లక్షలు ఖర్చు

dog
జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి కుక్కలా మారిపోయాడు. ఇందుకోసం ఏకంగా రూ.12 లక్షల రూపాయలను ఖర్చు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
సాధారణంగా మనిషి.. జంతువు పరిణామ క్రమం గురించి అభివృద్ధి చెందాడని మనం వింటూనే ఉంటాం. అలాంటి పరిస్థితిల్లో ఓ వ్యక్తి ఏకంగా లక్షలాది రూపాయలను ఖర్చు చేసి కుక్కలా మారిన వింత ఒకటి జపాన్ దేశంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించి, తన ఆనందాన్ని సైతం అందరితో పంచుకున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జెప్పెట్ అనే సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాలు వంటి తదితర అవసరాల కోసం పెద్ద ఎత్తున వాటికి కావాల్సిన శిల్పాలను, అద్భుత ఖండాలను రూపొందించిడమే కాకుండా, కాస్ట్యూమ్‌ను కూడా అందజేస్తుంది. అత్యంత ఆదరణ పొందిన మస్కట్ అనే పాత్రకు దుస్తులను కూడా రూపొందిస్తూ ఎంతో పేరును సంపాదించుకుంది. 
 
దీంతో అప్పటికే తాను శునకంలా మారాలన్న ఆలోచనతో ఉన్న టోకో ఇవీ అనే వ్యక్తి ఈ సంస్థను సంప్రదించగా, ఆయన కలను నెరవేర్చేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఆ తర్వాత అందుకు తగిన మందులను సరఫరా చేసింది. 
 
ఆ తర్వాత జెప్పెట్ సంస్థకు చెందిన కళాకారులు దాదాపు 40 రోజుల పాటు కష్టపడి టోకో ఇవీకి శునకంలా కనిపించేందుకు కావాల్సిన దుస్తులను తయారు చేశారు. వారు పొందించిన దుస్తులతో చివరకు టోకోను కోలీ జాతికి చెందిన శునకంలా మార్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.