1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. SSC exam invigilator found drunk, suspended

మద్యం కిక్కులోనే పరీక్షా హాలుకుకు వచ్చిన ఇన్విజిలేటర్

exma invigilator
తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం నియమించిన ఓ ఇన్విజిలేటర్ పీకలవరకు మద్య సేవించే పరీక్షా హాలుకు వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఇతర సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి ఆ ఇన్విజిలేటర్‌కు బ్రీతింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 30 ఉండాల్సిన స్థాయి ఏకంగా 112గా చూపించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత విద్యాధికారులు ఆ ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
సస్పెండ్‌కు గురైన ఇన్విజిలేటర్ పేరు రవికుమార్. హుజురాబాద్‌లోని రాంపూరులో గల జడ్పీహైస్కూలులో పీఈటీ మాస్టరుగా పని చేస్తున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి జనార్థన్ రావు మాట్లాడుతూ, విధుల్లో నిర్లక్ష్యం వహించే ఎవరినైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సదరు ఉపాధ్యాయుడికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించి అతనితో పాటు సెంటర్ సూపరింటెండెంట్‌ని నిర్లక్ష్య ధోరణి కారణంగా విధుల నుంచి తొలగించడం జరిగిందని తెలిపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు వద్దంటూ ఎందుకీ నిరసనలు? అసలేం జరుగుతోంది?