సంబంధిత వార్తలు
- ఎ.పి.లో సినిమా దుస్థితికి కారకులు ఎవరు?, ఇప్పుడు నాని, తర్వాత పవన్ కళ్యాణ్, మెగాస్టార్?!!
- ప్రజల బాగోగులు తెలుసుకుంటూ... పల్లెబాట పట్టిన సోమిరెడ్డి
- తమిళనాడు ఆర్టీసీ బస్సులో... తడ వద్ద గంజాయి పట్టివేత
- ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు.. బీరాపేరులో పడిన ఆటో
- వైసీపీ కార్యకర్తల ఇళ్ళకి ఎమ్మెల్యే కోటంరెడ్డి బాట!
బాహుబలి థియేటర్ మూసివేత: ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్కీన్ ఇక్కడే
V EPIQ Theatre
రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలు తగ్గించడంతో థియేటర్‌ను స్వచ్చంధంగా మూసివేస్తునట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్కీన్ ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌లో 640 సీట్ల కెపాసిటీ ఉంది. ప్రేక్షకులకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని నిర్మించారు. ఏపీలో బాహుబలి థియేటర్‌గా దీనికి పేరుంది.
ప్రస్తుతం ఇందులో నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీ ఆడుతోంది. అయితే టికెట్ రేట్లు భారీగా తగ్గడంతో చేసేదేమీ లేక థియేటర్‌ను మూసేసింది యాజమాన్యం. మల్టీప్లెక్స్ మూతపడటంతో సినీ ప్రేక్షకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సూళ్లూరు పేట జాతీయ రహదారిపై వీ-ఎపిక్ థియేటర్ ఉంది. సాహో సినిమాతో ఈ థియేటర్‌లో షోలు మొదలయ్యాయి. దీన్ని రామ్ చరణ్ ప్రారంభించారు.
తర్వాతి కథనం
