శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (08:50 IST)

సైకో ప్రిజనరీ: జగన్ పై అయ్యన్న నిప్పులు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిప్పులు చెరిగారు. జగన్ ను సైకో ప్రిజనరీ అంటూ ఏకిపారేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విట్టర్ లో కామెంట్ చేశారు. 
 
"వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల అమ్మకం కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేసాడు సైకో ప్రిజనరీ. సహజీవనం అన్న మేధావి ఇప్పుడు కరోనా కారణంగా ఇళ్ల పట్టాలు అమ్మకం వాయిదా పడింది అనడం విడ్డురంగా ఉంది.

పట్టాలు అమ్మకం,డబుల్ రేటుకి స్థలాలు కొనడం. అధికార పార్టీ వాళ్లే చెత్త పాలన అంటూ వేరే కుంపటి పెడుతున్నా ప్రిజనరీ దిగజరుతూనే ఉన్నాడు" అని వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి.