శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జులై 2020 (11:58 IST)

జగన్ గారూ!.. అందుకేనా మూడు రాజధానులు? : లోకేశ్ సెటైర్లు

అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ముఖ్యమంత్రి జగన్ పై సెటైర్లు వేశారు.
 
"జగన్ గారూ! మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేసి మీ అవినీతి భాగస్వామికొకటి, మీ తప్పుడు పత్రిక నిర్వాహకునికి ఒకటి, మీ మామకొకటి ఇచ్చేసుకోడానికా...  29,881 మంది రైతులు రాజధాని అమరావతి కోసం త్యాగం చేసింది?
 
మీ మూడు ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రాజధాని రైతులు, రైతు కూలీలు బలయ్యారు. వారి త్యాగాలను పణంగా పెట్టే మీ ఆటలు సాగనివ్వం. 200 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే తేలిగ్గా తీసుకుంటారా?
 
రాష్ట్రప్రజలరా! ఇది రాజధాని రైతు సమస్య మాత్రమే కాదు. విధ్వంసకర పాలనకు, ప్రజా ద్రోహానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. అందుకే కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏకంకండి. "ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని" అంటూ అమరావతి కోసం ఉద్యమిద్దాం. జై అమరావతి!" అని పేర్కొన్నారు.