1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Raghuramakrishnam Raju Stright Question to RRR

వారిద్దరిపై కూడా రాజద్రోహం కేసు పెడతారా? ఆర్ఆర్ఆర్ ప్రశ్న

Raghuramakrishnam Raju
ఏపీలోని అధికార వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోమారు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మార్చుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఈ విధంగా అప్పులు చేసుకుంటూ వెళితే ఇబ్బంది పడేది ప్రజలేనని ఆయన హెచ్చరించారు. 
 
ఏపీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా చేస్తున్న లక్షల కోట్ల అప్పులపై ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. ప్రశ్నిస్తున్నందుకే తనపై దేశద్రోహం కేసు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్, పవన్ కల్యాణ్ కూడా ప్రశ్నిస్తున్నారని, వారిపైనా రాజద్రోహం కేసు పెడతారా? అని ప్రశ్నించారు. 
 
పరిస్థితులపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చినందుకే నన్ను శిక్షించారా? అని రఘురామ వ్యాఖ్యానించారు. పత్రికల బాధ్యతను గుర్తించిన ఆంధ్రజ్యోతి అప్పుల వార్తను ప్రజల ముందుంచిందని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనన్ని అప్పులు చేశారంటూ దుయ్యబట్టారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తాజా ప్యాకేజింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల గౌరవాన్ని వేడుక చేస్తున్న టాటా టీ చక్ర గోల్డ్‌