సంబంధిత వార్తలు
- కదలండి.. బాబు పిలుపు: ముంపు గ్రామాల ప్రజలకు మందులు, ఆహారం
- ఇది చెడ్డ సంప్రదాయం - కొత్తగా ఆంధ్ర ఏర్పడ్డాకే వచ్చింది - నాగబాబు
- నన్ను కలచివేసింది- రాబోయే తరానికి ఇవా ఇచ్చేది - ఎన్.టి.ఆర్. సూటిప్రశ్న
- ఖబడ్దార్.. ఇక చంద్రబాబు అనుమతి అవసరంలేదు, మీ భరతం పడతాం: బాలయ్య వార్నింగ్
- చేతులు అడ్డుపెట్టుకుని చంద్రబాబు కన్నీళ్లు: బాలకృష్ణ సమాధానికి అభిమానుల అసంతృప్తి
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ ... పరామర్శ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం జరిగింది. అధికార వైకాపాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరిని అసభ్యంగా మాట్లాడి హేళన చేశారు. దీంతో కలత చెందిన చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీరుకార్చారు. దీంతో అనేకకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.
అదేసమయంలో పలువురు ప్రముఖులు చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. ఇలాంటి వారిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. బాబుకు ఫోన్ చేసిన రజనీకాంత్ పరామర్శించారు.
ఇలాంటి సందర్భాల్లోనే మరింత ధైర్యంగా ఉండాలంటూ హితవు పలికినట్టు సమాచారం. అందేసమయంలో చంద్రబాబుకు పలువురు జాతీయ నేతలు కూడా అండగా నిలుస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వారు అభిప్రాయపడుతున్నారు.
