మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

కమలాపురంలో కూలిన పాపాగ్ని నది వంతెన ... రాకపోకలు బంద్

ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు జిల్లాల్లో వరద నీరు బీభత్సం సృష్టించింది. ఈ నష్టం కడప జిల్లాలో అధికంగా ఉంది. తాజాగా ఈ జిల్లాలోని కమలాపురం పాపాగ్ని నదిపై ఉన్న వంతెన గత అర్థరాత్రి కూలిపోయింది. వెలిగల్లు జలాశయం నుంచి నాలుగు గేట్లు ఎత్తివేయడంతో ఈ నదికి వరద నీరు ఒక్కసారిగా పోటెత్తింది. 
 
అప్పటికే వంతెన బాగా నాని వుండటంతో పాటు గత రెండు రోజులుగా ఈ నది ప్రమాదకరంగా ప్రవహిస్తూ వచ్చింది. కొత్తగా వెలిగల్లు వరద నీరు ఒక్కసారిగా ఉధృతంగా రావడంతో వెంతన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 
 
ఈ బ్రిడ్జిపై నుంచే అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారి వుంది. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనరాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయు. ఈ వంతెన నిర్మాణ పూర్తయ్యేంత వరకు రాకపోకలు బంద్ అయినట్టే. అయితే, ఈ వంతెన కూలిపోవడంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. ఈ పరిస్థితి నెల రోజుల పాటు కొనసాగనుంది.