1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Remand death in Rajamahendravaram

చికిత్స పొందుతూ రిమాండ్‌ ఖైదీ మృతి...

Rajamahendra varam
తూర్పుగోదావరి రాజమహేంద్రవరం కేంద్ర ఖారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నమ్మి ఉమావెంకట దుర్గా వరప్రసాద్‌ (36) కాకినాడలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. 
 
ఈయన ఓ కేసుకు సంబంధించి జూన్‌ 13 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఖైదీగా ఉన్నాడు. కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నాడు. 
 
పరిస్థితి విషమించడంతో ఈనెల 25న కాకినాడ జీజీహెచ్‌లో చేరగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడని జీజీహెచ్‌ ఔట్‌ పోస్టు పోలీసులు తెలిపారు.
తర్వాతి కథనం
వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం.. లబ్ధి పొందిన వారెందరో తెలుసా?