శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (15:53 IST)

ఆలయ భూములను ఏపీ ప్రభుత్వం అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం

జగన్ ప్రభుత్వం ఆలయాల భూములను అమ్మతుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ లోని పలు గుడుల భూముల అమ్మడానికి జగన్ ప్రభుత్వం చూస్తుందని చెప్పారు. గత సీఎంలు గుడులను కూల్చి, ఆస్తులను తాకట్టు పెట్టారని అన్నారు. 
 
ప్రస్తుతం.. ద్వారకా తిరుమల ఆలయ ఆస్తుల భూమిని ఏపీ ప్రభుత్వం వేలానికి పెట్టిందని దీంతో పాటు మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి గుడి భూములను అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి ప్రభుత్వంలోకి వచ్చాక గుడి ఆస్తులు అమ్ముతున్నారని విమర్శించారు.