మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (17:18 IST)

వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం.. లబ్ధి పొందిన వారెందరో తెలుసా?

అమరావతి : వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం రెండో విడత కింద లబ్దిదారులను ఖరారు చేశామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని బుధవారం వెల్లడించారు. రెండో విడతలో మొత్తం 65,054 దరఖాస్తులు రాగా, అందులో 62,630 దరఖాస్తులను లబ్దిదారులుగా గుర్తించామని వివరించారు.
 
ఇప్పటివరకు మొత్తం 2 లక్షల 36 వేల 340 మందికి రెండు విడతల్లో ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఇందుకోసం 230 కోట్ల రూపాయలు విడుదల చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది కొత్త లబ్దిదారులు ఎంతమంది వస్తే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు.