శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (14:38 IST)

రాజ్యాంగం అందరికీ ఆదర్శం.. అందుకే అమ్మ ఒడి: సీఎస్ సాహ్ని

అమరావతి : విద్య, వైద్య రంగాలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎస్ నీలం సాహ్ని తెలిపారు. ఇవాళ ఏపీ రాజభవన్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సాహ్ని పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాల ప్రస్తావన తెచ్చారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 
 
అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శమన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రాధమిక హక్కులు ఉండాలని సాహ్ని ఆకాంక్షించారు. 2015నుంచి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు.
 
 
అందుకే అమ్మ ఒడి : ‘బడుగు బలహీన వర్గాలకు మెరుగైన విద్య అందించడం ద్వారా అభివృద్ధి సాధ్యం. తల్లిదండ్రులు తమ‌ పిల్లలను బడికి పంపడం‌ బాధ్యతగా భావించాలి. అందుకే ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా అమ్మలకు‌ చేయూతను ఇస్తోంది. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు’ అని సాహ్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.