సంబంధిత వార్తలు
- టీజీఎస్ఆర్టీసీగా టీఎస్ఆర్టీసీ.. కొత్త లోగో ఖరారైందా?
- వాయుగుండంగా మారనున్న అల్పపీడనం... ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
- క్రికెటర్ల జీవితాలంటే లెక్కలేకుండా పోయింది : రోహిత్ శర్మ
- ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విశేషమైన విజయం
- గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!
ప్రధాని మోడీ విజయవాడ్ రోడ్‌షోలో డ్రోన్ల ఎగురవేత : కేంద్రం సీరియస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయవాడ నగరంలో రోడ్‌షో నిర్వహించారు. ఇందులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అయితే, ప్రధాని మోడీ రోడ్ షో సందర్భంగా డ్రోన్లు ఎగరడం కలకలం రేపింది. ఈ చర్యలు కేంద్రం సీరియస్‌గా తీసుకుంది.
ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. ప్రధాని రోడ్ షో ప్రారంభానికి 45 నిమిషాల ముందు, రోడ్ షో ముగింపు సమయంలో డ్రోన్లు ఎగురవేశారంటూ తన లేఖలో ఆరోపించింది.
ప్రధాని రోడ్ షో చేపట్టిన బందరు రోడ్ ప్రాంతాన్ని ఎస్పీజీ ముందుగానే నో ఫ్లై జోన్‌గా ప్రకటించింది. ఎస్పీజీ మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ మోడీ రోడ్ షోలో డ్రోన్లు కనిపించాయి. రోడ్ షో ప్రారంభానికి 45 నిమిషాల ముందు ఓ డ్రోన్‌ను గుర్తించిన ఎస్పీజీ సిబ్బంది దాన్ని నిర్వీర్యం చేశారు. నిజానికి నో ఫ్లై జోన్‌గా ప్రకటించిన తర్వాత ఎలాంటి డ్రోన్లు ఎగురవేయడానికి వీల్లేదు. కానీ, ఎస్పీజీ అధికారులు వారించినప్పటికీ ఏపీ పోలీసులు ఈ డ్రోన్లు ఎగురవేసినట్టు సమాచారం. దీనిపై అటు కేంద్రం, ఇటు ఎస్పీజీ విభాగం సీరియస్ అయింది.
