బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (09:45 IST)

అమెరికాలో రోడ్డు ప్రమాదం : ఏపీకి చెందిన బీలం అచ్యుత్ మృతి

deadbody
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడిని బీలం అచ్యుత్‌గా గుర్తించారు. బుధవారం సాయంత్రం ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. న్యూయార్క్ స్టేట్ విశ్వవిద్యాలయంలో అచ్యుత్ విద్యాభ్యాసం చేస్తున్నాడని తెలిపింది. 
 
"న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థి బుధవారం మధ్యాహ్నం జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. అతడి అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాం. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని తిరిగి భారత్‌కు పంపించేందుకు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తున్నాం" అని ఇండియన్ ఎంబసీ అధికారులు వెల్లడించారు.