1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Separate corporations for three ports in AP

ఏపీలో మూడు పోర్టులకు ప్రత్యేక కార్పొరేషన్లు

Separate corporations
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు ఓడరేవుల నిర్మాణం, అభివృద్ధి కోసం చర్యలు ప్రారంభించింది. మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం ప్రత్యేకంగా పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది.

ఈ ప్రత్యేక కార్పొరేషన్లలో బోర్డు డైరెక్టర్లుగా సీఎస్, మరో ఐదుగురు ఉన్నతాధికారులు ఉండనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్లు ఏపీ మేరిటైమ్ బోర్డు పర్యవేక్షణలో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా పనిచేస్తాయని ప్రభుత్వం తెలిపింది.
About Writer
ఎం
తర్వాతి కథనం
తూర్పుగోదావరిలో కరోనా కలకలం?