బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (14:33 IST)

కేకే ఏపీ రాజ్యసభ సభ్యుడు... తెలంగాణలో ఎలా ఓటేస్తారు?

కేకేపై వెంకయ్యనాయుడికి భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకేకు ఓటుహక్కు కల్పించడంపై వెంకయ్యనాయుడికి తెలిపారు.

తెరాస మున్సిపల్​ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లు వివరించారు. రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడిని లక్ష్మణ్​ నేతృత్వంలోని బృందం దిల్లీలో కలిసింది. తెరాస రాజ్యసభ ఎంపీ కేశవరావుపై భాజపా నేతలు ఫిర్యాదు చేశారు.

ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకేకు మున్సిపల్​ ఎన్నికల్లో ఎక్స్​ అఫీషియో కింద ఓటుహక్కు కల్పించడంపై వెంకయ్యనాయుడికి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని తెరాస ఖూనీ చేసిందని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. ఏపీ రాజ్యసభ ఎంపీ కేశవరావుకు ఎలా ఓటు కల్పిస్తారని ప్రశ్నించారు. తుక్కుగూడలో భాజపాకు పూర్తి మెజారిటీ వచ్చినా అక్రమంగా తెరాస సభ్యులు గెలిచారని ఆరోపించారు.

కేకేపై చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి పంపించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని రాజ్యసభ ఛైర్మన్ చెప్పారని లక్ష్మణ్​ స్పష్టం చేశారు.