సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (16:14 IST)

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు కామెంట్స్

రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని.. దీనికి అధిపతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు కామెంట్స్  చేశారు. 
 
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం నిలద్రొక్కుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళితే జగన్మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల్లో కోసం వేసే కమిటీలలో వాస్తవాలు చెప్పకుండా రిపోర్ట్‌లో విశాఖపట్నం అనువైన ప్రదేశం కాదు అని చెప్పే కవర్ పేజీ తీసివేయడం జరిగింది అని ఫైర్ అయ్యారు. 
 
వీరి స్వార్ధప్రయోజనాలు కోసం ఎన్ని పాపాలు అయినా చేస్తారు అనే విషయం అర్థమైంది అని.. వారి స్వార్ధప్రయోజనం కోసం మాత్రమే మూడు రాజదానిలను తెరపైకి తీసుకొచ్చారు. 
 
 
ఉన్నభూములలో రాజదాని కట్టడం చేతగాక విశాఖపట్నంలో మరల భూములు సేకరించాలని అని చెబుతున్నారు. విజయ్ సాయిరెడ్డి గారు దేవుడు అడ్డు వచ్చినా విశాఖపట్నంలో రాజదాని ఏర్పాటు చేస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని.. అర్జునుడు వ్యాఖ్యానించారు. 
 
ప్రజలకు ముఖ్యమంత్రి ఎవరు అనే అనుమానం కలుగుతోంది అని.. జగన్మోహన్ రెడ్డి గారి చేష్టలు వలన కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టె పారిశ్రామికవేత్తలు వెనుకకు వెళ్లిపోతున్నారని అర్జునుడు ఫైర్ అయ్యారు. 
పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానకారకుడు అని..
 
వృద్ధులకు 3 వేలు పెన్షన్ ఇస్తామని 250 మాత్రమే పెంచారు అని.  రైతులకు ఇచ్చే డబ్బులతో కూడా మాటమార్చారు అని.. అమ్మవడిలో ఎంతమోసం చేశారో చూడలేదా అని ప్రశ్నించారు.. 
 
ఇసుకను లూటీ చేస్తున్నారు అని.. ఈ పెరిగినఇసుకధరలు ఎవరి జోబులోకి వెళుతున్నాయి అని ప్రశ్నించారు.
 
జగన్మోహన్ రెడ్డి గారు రాజదాని అమరావతికి అప్పటిలో స్వాగతించి ఇప్పుడు రాజదాని మార్పు మాటమార్చడం మడమతిప్పడం కదా అని ప్రశ్నించారు.. రాబోయే స్ధానికఎన్నికల్లో ప్రజలు చెప్పే తీర్పుతో మీరు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని.. ప్రజాక్షేత్రంలో మీ బండారం బయటపడుతోంది అని వ్యాఖ్యానించారు. 
 
వివేకానందరెడ్డి హత్యకు గురైననాడు సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా సీబీఐని ఎందుకు వేయలేదు.. వివేకానందరెడ్డి గారు కుమార్తె సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.. అసలు దోషులను వదిలి అమాయకులను విచారణ జరిపిస్తున్నారని ఆరోపించారు.