నెల్లూరు జిల్లాలో అద్భుతం - శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసిన నాగుపాములు (Video)
నెల్లూరు జిల్లాలోని ఓ శివాయంలో అద్భుత దృశ్యం కనిపించింది. ఆలయంలోని శివలింగం చుట్టూ మూడు నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. జిల్లాలోని మనుబోలు మండలం, బీసీ కాలనీ సమీపంలోని శ్రీకాశీవిశ్వనాథ స్వామి ఆలయంలో సోమవారం ఉదయం మూడు నాగు పాములు శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కనిపించాయి. శివలింగాన్ని చుట్టుకుని కొద్దిసేపు అక్కడే పడగవిప్పి ఉన్న సర్పాలను చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ మూడు పాములు ఆలయంలోనే ఉన్న పుట్టలోకి వెళ్లిపోయాయి.
ఈ అరుదైన దృశ్యాన్ని కొందరు భక్తులు తమ ఫోన్లలో వీడియో తీయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా దర్శించారు. శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజే ఇలా మూడు నాగసర్వాలు కనిపించడం దైవ సంకేతంగా భక్తులు భావిస్తున్నారు.
ఈ ఆలయంలో నాగుపాములు కనిపించడం ఇదే తొలిసారికాదు. గత యేడాది మే 17వ తేదీన కూడా అభిషేకం తర్వాత శివలింగంపై ఓ నాగుపాము పడగవిప్పి దర్శనమిచ్చింది. అలాగే, గత యేడాది అక్టోబరు నెల నాగుల చవితి రోజున కూడా రెండు నాగు పాములు శివలింగం పక్కన కనిపించి భక్తులను ఆశ్చర్యపరిచాయి. ఈ ఆలయంలో తరచుగా ఇలా నాగుపాములు కనిపించడం ఆ క్షేత్ర మహత్మ్యంగా స్థానిక భక్తులు అభిప్రాయపడుతున్నారు.
శివుని ముందు నాగపాములు..! నెల్లూరు, మనుబోలు చెర్లోపల్లి గేటు వద్ద విశ్వనాథ స్వామి ఆలయంలోకి తెల్లవారుజామున మూడు నాగుపాములు వచ్చాయి. శివలింగం ఎదురుగా పడగవిప్పి కాసేపు అక్కడే ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. #haraharamahadev #shamboshankara https://t.co/KrZoqJjPvU
— Sanjay Journalist (@SanjuJournalist) October 5, 2026
