1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Kalki Bhagwan passes away at -85

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ ఇకలేరు...

kalki bhagwan
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ ఇకలేరు. ఆయన వయసు 85 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచినట్టు ట్రస్ట్ ప్రతినిధి వెల్లడించారు. 
 
భగవాన్ కుమారుడైన కృష్ణాజీతో పాటు ఆశ్రమానికి(ఏకం ట్రస్టు) చెందిన దాసాజీలు, ప్రతినిధులు చెన్నైలోని ఆసుపత్రి వద్ద ఉన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తులవల్లంలోని ఏకం ఆలయాని(గోల్డెన్ సిటీ)కి కల్కి భగవాన్ పార్థివదేహాన్ని తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. 
 
ఏకం ఆలయాన్ని రూ.200 కోట్లతో పాలరాతితో నిర్మించారు. ఆలయంలోనే కల్కి భగవాన్ అంత్యక్రియలను శనివారం నిర్వహించేందుకు, సమాధి నిర్మాణానికి పనులు సాగుతున్నాయి. సతీమణి అమ్మభగవాన్‌తో కలిసి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన కల్కి భగవాను ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు.
 
విజయ్ కుమార్ పేరుతో ఎల్ఐసీ ఏజెంటుగా, ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన 1992లో తాను కల్కి అవతారమంటూ కల్కి భగవాన్ పేరుతో ప్రపంచానికి పరిచయమయ్యారు. తొలుత కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆపై తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు సమీపంలో నేమం ప్రాంతంలో కల్కి భగవాన్ ఆధ్యాత్మిక బోధనలు చేశారు. 
 
ఆపై వరదయ్యపాళెం పంచాయతీ గోవర్ధనపురంలో కల్కి గ్రామీణాభివృద్ధి ట్రస్టు పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆశ్రమాల్లో విదేశీ భక్తులతో పాటు, దేశం నలుమూలల నుంచి వచ్చే వారికి ధ్యానం, ముక్తి దీక్ష తదితర ఆధ్యాత్మిక తరగతులు నిర్వహించేవారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అదిగో... ఆ చెడ్డ అంకులే... కోర్టులో చిన్నారి సాక్ష్యం - ముసలోడు అయ్యేంత వరకు జైలు