శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శనివారం, 26 మే 2018 (18:58 IST)

రమణ దీక్షితులను జైల్లో పెట్టి నాలుగు తగిలిస్తే అన్నీ బయటకు వస్తాయ్...

రమణ దీక్షితులను జైల్లో పెట్టి నాలుగు తగిలిస్తే అన్నీ బయటకు వస్తాయంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటారా..? బీజేపీ, వైసీపీలు టీటీడీ వివాదంపై నీచమైన భాష వాడతారా..? రమణ దీక్షితులు వంటి వాళ్ల వల్ల భ

రమణ దీక్షితులను జైల్లో పెట్టి నాలుగు తగిలిస్తే అన్నీ బయటకు వస్తాయంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటారా..? బీజేపీ, వైసీపీలు టీటీడీ వివాదంపై నీచమైన భాష వాడతారా..? రమణ దీక్షితులు వంటి వాళ్ల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.
 
వెంకన్నను బజారుకీడిస్తే నాశనం అవుతారు.. చెత్త రాజకీయాలు పక్కన పెట్టండి. రమణ దీక్షితులను బొక్కలో తోసి తగిలిస్తే నిజాలు బయటకు వస్తాయి. వెంకన్న దగ్గరుండి రమణ దీక్షితులు ఏం తప్పు చేశారో అన్నీ బయటకు వస్తాయి. చంద్రబాబుకు వెంకన్న పునర్జన్మ ఇచ్చారు. ఓ భక్తుడిగా నా అభిప్రాయం చెప్పాను అని వ్యాఖ్యానించారు సోమిరెడ్డి.