జనసేన ఒక కులసేన... దేనికి నిదర్శనం #PK గారూ అంటూ శ్రీరెడ్డి
కాస్టింగ్ కౌచ్ పైన పోరాడుతూ వచ్చిన శ్రీరెడ్డి అకస్మాత్తుగా రాజకీయాల్లోకి దూరుతోంది. ఆమె తాజాగా ఫేస్ బుక్ లో చేసిన పోస్టింగ్ చూస్తే ఇదే అర్థమవుతుంది. ఆమె పోస్ట్ యధాతథంగా... " జనసేనని ఎందుకు కులసేన అంటున్నారో ఒకసారి ఆ పార్టీ నిర్మాణాన్ని చూస్తే మీకే అర
కాస్టింగ్ కౌచ్ పైన పోరాడుతూ వచ్చిన శ్రీరెడ్డి అకస్మాత్తుగా రాజకీయాల్లోకి దూరుతోంది. ఆమె తాజాగా ఫేస్ బుక్ లో చేసిన పోస్టింగ్ చూస్తే ఇదే అర్థమవుతుంది. ఆమె పోస్ట్ యధాతథంగా... " జనసేనని ఎందుకు కులసేన అంటున్నారో ఒకసారి ఆ పార్టీ నిర్మాణాన్ని చూస్తే మీకే అర్ధం అవుతుంది.
జనసేన పార్టీ అధ్యక్షడు- పవన్ కళ్యాణ్ (కాపు)
జనసేన కోర్దినేటర్ -మాదాసు గంగాధరం (కాపు)
జనసేన అధికార ప్రతినిధి-తోట చంద్రశేఖర్ (కాపు)
జనసేనా కోశాధికారి-మారిశెట్టి రాఘవయ్య (కాపు)
జనసేనా అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్
--అద్దేపల్లి శ్రీధర్ (కాపు)
--పార్థసారథి (కాపు)
జనసేనా మీడియా ఇంచార్జ్-పసుపులేటి హరిప్రసాద్ (కాపు)
జనసేనా యువజన విభాగం ప్రెసిడెంట్-కిరణ్ (కాపు)
జనసేన కృష్ణా-గుంటూరు ఉభయాజిల్లాల ఇంచార్జీ
- ముత్తంశెట్టి కృష్ణారావు (కాపు)
ఇలా పార్టీలో ఉన్న అత్యంత ప్రాధాన్యత పదవులు, ఉన్నతస్థానాల దగ్గరి నుంచి చివరికి జిల్లా ఇంచార్జీల వరకు ప్రతిచోటా కాపు నాయకులతో నింపేశారు... మా పార్టీ కులాలకు అతీతం అని చెప్తూ ఇలా ఒక సామాజిక వర్గానినే అందలం ఎక్కించడం దేనికి నిదర్శనం #PK గారు..." అంటూ ప్రశ్నించింది శ్రీరెడ్డి. ఇప్పటికే ఈ పోస్టుపై జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందన తెలియజేస్తున్నారు. చూడాలి ఇది ఎంతవరకు వెళుతుందో?