సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : ఆదివారం, 20 మే 2018 (15:35 IST)

రేవతికి జనసేనాని సాయం.. గబ్బర్‌సింగ్ డైలాగ్స్, అన్నమయ్య కీర్తన విని పవన్?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేవతి అనే చిన్నారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. రేవతి అనే చిన్నారి కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆమె శరీరంలోని ఒక్కో అవయవం చచ్చుబడిపోతోంది. ఆమెకు చికిత్స

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేవతి అనే చిన్నారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. రేవతి అనే చిన్నారి కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆమె శరీరంలోని ఒక్కో అవయవం చచ్చుబడిపోతోంది. ఆమెకు చికిత్స చేయించే స్థోమత లేకుండా చిన్నారి తల్లిదండ్రులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. 
 
విశాఖ పర్యటన సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు తమ కూతురు రేవతికి ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరారు. దీంతో చలించిన జనసేనాని తనవంతు సహాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అంతేకాదు వారి ఇంటికెళ్లిన పవన్…ఆ చిన్నారిని ఆప్యాయంగా ఒడిలోకి కూర్చోబెట్టుకుని మాటలు చెప్పారు. 
 
పవన్ కల్యాణ్ ఒళ్లో కూర్చున్న చిన్నారి రేవతి ఎన్నో ముచ్చట్లు చెప్పింది. గబ్బర్ సింగ్ సినిమా అంటే తనకు ఇష్టమని తెలిపింది. ఈ చిత్రంలోని పాటలు, డైలాగ్స్ రేవతి చెప్పడంతో పవన్ ఎంతో ముచ్చట పడ్డారు. రేవతి పాడిన అన్నమయ్య కీర్తనలు విని ఆశ్చర్యపోయారు. రేవతికి ఆర్థిక సాయంతో పాటు బ్యాటరీతో నడిచే వీల్ చైర్‌ను జనసేన తరపున ఇస్తామని పవన్ భరోసా ఇచ్చారు. పవన్‌‌ను చూడాలనే తన కుమార్తె కలను జనసేనాని నెరవేర్చారంటూ చిన్నారి తల్లి ధన్యవాదాలు తెలిపారు.