గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 19 మే 2018 (19:39 IST)

వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పవన్ పోటీ...?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే అనంతపురం టౌన్ నుంచి పోటీ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్‌ తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే జనసేన పార్టీ కార్యకర్తలు,

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే అనంతపురం టౌన్ నుంచి పోటీ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్‌ తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచనలు ఇవ్వడమే కాకుండా తనను గెలిపించే బాధ్యత పార్టీ శ్రేణులే తీసుకోవాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. ఇంతకీ పవన్ కళ్యాణ్‌ ఉన్నట్లుండి ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో తెలుసా...?
 
ప్రత్యక్ష ఎన్నికల్లో దిగి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్‌. ఇప్పటికే పలుచోట్ల తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనిస్టులతో కలిసి ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు ఒంటరిగా బస్సు యాత్ర చేపట్టారు. ప్రజల సమస్యలను దగ్గర నుండి తెలుసుకునేందుకు ఇదంతా చేస్తున్నారు పవన్. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేసి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు. తానొక్కడే గెలవడమే కాకుండా అందరినీ గెలిపించుకోవాలన్నది పవన్ కళ్యాణ్‌ ఉద్దేశం. 
 
కానీ తాను నిలబడే ప్రాంతంలో భారీ మెజారిటీతో గెలవాలన్న ఉద్దేశంలో ఉన్నారు. అందుకే తన అన్న చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్న తిరుపతినే ఎంచుకున్నారు. పవన్ తిరుపతిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం కూడా ఉందంటున్నారు జనసేన పార్టీ నేతలు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే తిరుపతిలో నిలబడితే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తానన్నది పవన్ కళ్యాన్‌ నమ్మకం. ఒకవైపు సినీ నటుడిగా తనకున్న చరిష్మా, మరోవైపు కాపు కులంతో ఓట్లు బాగా పడతాయన్న ధీమాతో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఒకవేళ పవన్ కళ్యాణ్‌ తిరుపతిలో నిలబడితే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిచే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.