గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 19 మే 2018 (13:54 IST)

నేను సీఎం అవ్వాలంటే మీరేం చేయాలో తెలుసా? ప్రజలతో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో వున

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో వున్న పవన్ కళ్యాణ్, ప్రజల వద్దకు వెళ్లగానే అక్కడివారంతా పెద్దఎత్తున సీఎం.. సీఎం.. సీఎం.. పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.... " నేను మీరంటున్నట్లుగా సీఎం కావాలంటే మీరు ఒకటి చేయాలి. అదేమిటంటే... నాకు ముందుగా ప్రజా సమస్యలు తెలియాలి. అవి తెలుసుకునేందుకు మీరు నాకు సహకరించాలి.
 
నేను అందరిలా మాట్లాడి వెళ్లేపోయేవాడిని కానేకాదు. నాకు సమస్యలు అర్థం కావాలి. 2014లో మీ అందరికీ నేను చెప్పాను. ఆరోజు జనసేనతో సహా భాజపా, తెదేపా మా మూడు పార్టీలు ప్రామిస్ చేశాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఆ రెండు పార్టీలు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలేదు. అందుకే నా పని నన్ను చేసుకోనివ్వండి. బాధ్యతతో కూడిన కొత్తరకం ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. 
 
తెలుగుదేశం పార్టీలా వాళ్ల కుటుంబాలు, వాళ్లు బంధువర్గం కోసం పనిచేయకూడదు. ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి. కొందరి కోసం ప్రభుత్వం పనిచేయకూడదు. యావన్మంది ప్రజల కోసమే ప్రభుత్వం నడవాలి" అని అన్నారు.