20వ తేదీ నుంచి బస్సు యాత్ర.. గంగపూజ తర్వాత..?: పవన్ కల్యాణ్
పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 17 రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తన పర్యటన ఉంటుందని జనసేనాని ప్రకటించారు. ఉత్తరాంధ్రలో ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన
పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 17 రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తన పర్యటన ఉంటుందని జనసేనాని ప్రకటించారు. ఉత్తరాంధ్రలో ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాటం ప్రారంభిస్తున్నానని, ఇందులోభాగంగా ఈ నెల 20వ తేదీన ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్ర చేపడుతున్నట్లు పవన్ ప్రకటించారు.
గంగపూజ నిర్వహించిన తర్వాత యాత్ర వుంటుందని.. ఈ సందర్భంగా జై ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు అర్పిస్తామని చెప్పారు. బస్సుయాత్రలో భాగంగా ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ప్రతి నియోజకవర్గంలో యువత, విద్యార్థులతో కవాతు నిర్వహిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో లక్షమందితో ఈ కవాతు ఉంటుందని పవన్ చెప్పారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఈ యాత్ర సందర్భంగా అడిగి తెలుసుకుంటానని చెప్పారు.
ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంటే ఇలాగే ఉంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరుగుతాయని పవన్ కళ్యాణ్ పరోక్షంగా టీడీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హెచ్చరించారు. జనసేన మేనిఫెస్టో టీం కూడా బస్సు యాత్రలో పాల్గొంటుందని తెలిపారు. తన యాత్రలో సమస్యల పరిశీలనతో పాటు పరిష్కారం పైన కూడా దృష్టి సారిస్తానని చెప్పారు. 2019 ఎన్నికలే తమ లక్ష్యమని చెప్పారు.