శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 16 మే 2018 (17:42 IST)

చంద్రబాబుకు అది దోచేయడం బాగా తెలుసు: పవన్ కళ్యాణ్ విమర్శ

మానవతా దృష్టి ప్రభుత్వానికి లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌. బిందెడు ఆశ చూపి మూడు స్పూన్ల తీర్థం తాగించినట్లుగా రైతు రుణమాఫీ ఉందని టిడిపి ప్రభుత్వాన్ని విమర్శించారాయన. తిరుపతి శివార్లలోని శెట్టిపల్లిలో జనసభలో

మానవతా దృష్టి ప్రభుత్వానికి లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌. బిందెడు ఆశ చూపి మూడు స్పూన్ల తీర్థం తాగించినట్లుగా రైతు రుణమాఫీ ఉందని టిడిపి ప్రభుత్వాన్ని విమర్శించారాయన. తిరుపతి శివార్లలోని శెట్టిపల్లిలో జనసభలో పవన్ కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఎన్నోయేళ్ళుగా పంటలు వేస్తున్న రైతుల భూములను ఆర్థిక నగరి పేరుతో ప్రభుత్వం భూములను లాక్కోవడం దారుణమన్నారు. 
 
వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుంటే రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామన్నారు. పైడిపల్లికి న్యాయం చేసి శెట్టిపల్లికి ఎందుకు న్యాయం చేయరని ప్రశ్నించారు. గ్రామాల్లో ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై మండిపడుతున్నారని, తమ సమస్యలపై ప్రజలే ప్రభుత్వంపై ఎదురుతిరగాలని పవన్ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు.
 
దోపిడీదారులకు తెలుగుదేశం పార్టీ కొమ్ముకాస్తోందని, వేల కోట్ల రూపాయల ప్రజా డబ్బును తెలుగుదేశం పార్టీ నేతలు దోచేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ విధానంలో మార్పు తీసుకురావాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. వీడియోలో ఆయన మాటలు చూడండి...