శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 16 మే 2018 (13:25 IST)

నేల టికెట్‌కు తర్వాత ''సాక్ష్యం''.. ఆడియో వేడుకకు ఓకే చెప్పిన పవన్?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అజ్ఞాతవాసి సినిమాకు తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగారు. ప్రస్తుతం చిత్తూరు పర్యటనలో వున్న పవన్ కల్యాణ్.. సినిమాలకు దూరంగా వున్నా.. సినిమా ఆడియో కార్యక్రమాలకు హాజరవుతు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అజ్ఞాతవాసి సినిమాకు తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగారు. ప్రస్తుతం చిత్తూరు పర్యటనలో వున్న పవన్ కల్యాణ్.. సినిమాలకు దూరంగా వున్నా.. సినిమా ఆడియో కార్యక్రమాలకు హాజరవుతున్నారు.


నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సక్సెస్ మీట్, రవితేజ నేల టికెట్ ఆడియో కార్యక్రమంలో మెరిసిన పవన్ కల్యాణ్.. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' సినిమా ఆడియో వేడుకలో పాల్గొనేందుకు సిద్ధంగా వున్నారు. 
 
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఆడియో వేడుక ఈ నెల26న హైదరాబాదులో జరిపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ వేడుకకి ప్రత్యేక అతిథిగా పవన్ కల్యాణ్‌‍ను ఆహ్వానించారట. ఈ ఆడియో కార్యక్రమానికి పవన్ కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.