శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 14 మే 2018 (15:02 IST)

రజనీకాంత్‌ కత్తికి రెండు వైపులా పదును... వ్యూహాత్మక అడుగులు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఇప్పటికే రజనీ మక్కల్ మండ్రం పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి, తద్వారా ప్రజా సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరం

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఇప్పటికే రజనీ మక్కల్ మండ్రం పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి, తద్వారా ప్రజా సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరం చేశారు. అదేసమయంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
 
దీనిపై రాజకీయ విశ్లేషకులు కూడా తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల మద్దతు కోసం రజనీకాంత్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల చెన్నై మదురవాయల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో జరిగిన ఎంజీఆర్‌ విగ్రహావిష్కరణలో పాల్గొన్న రజనీకాంత్‌ 'ఎంజీఆర్‌ తరహాలో సుపరిపాలనను అందిస్తాన'ని వ్యాఖ్యానించారు. దీని ద్వారా అన్నాడీఎంకే కార్యకర్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 
 
ఆ తర్వాత తాజాగా నగరంలో జరిగిన 'కాలా' ఆడియో ఆవిష్కరణ వేడుకల్లో రజనీ మాట్లాడుతూ.. 'శివాజి' విజయోత్సవంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తనను ప్రశంసిస్తూ మాట్లాడారని, ఆయన స్వరం మళ్లీ వినాలని ఆసక్తితో ఉన్నట్టు తెలిపారు. దీని ద్వారా తనకు కరుణానిధి వ్యతిరేకి కాదనే సంకేతాలు కూడా పంపారు. డీఎంకేలో స్టాలిన్‌ నాయకత్వాన్ని అంగీకరించని వారిని తాను ప్రారంభించనున్న పార్టీలోకి ఆహ్వానించడం కోసమే రజనీకాంత్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 
 
ముఖ్యంగా, రాష్ట్రంలో జయలలిత మరణం, కరుణానిధి అనారోగ్యం కారణంగా ఏర్పడిన రాజకీయ శూన్యతను ఖచ్చితంగా భర్తీ చేయగలనని రజనీకాంత్‌ విశ్వసిస్తున్నారని సమాచారం. దీని కోసం అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని తెలిసింది. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే శ్రేణులను ఏమాత్రం నొప్పించకుండా ఆయన తన కత్తికి రెండు వైపులా పదును ఉందన్న రీతిలో ముందుకు సాగదు.