సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Srinivas
Last Modified: గురువారం, 10 మే 2018 (14:12 IST)

త‌మిళ‌నాడుకి మంచి రోజులు రాబోతున్నాయి... ర‌జ‌నీకాంత్..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - క‌బాలి ఫేమ్ రంజిత్ పా క‌ల‌యిక‌లో వ‌స్తోన్న తాజా చిత్రం కాలా. రోబో సీక్వెల్ 2.0 త‌ర్వాత ప్రారంభ‌మైన ఈ సినిమా 2.0 కంటే ముందుగానే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. సంతోష్ నారాయ‌ణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర తమిళ ఆడియ

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - క‌బాలి ఫేమ్ రంజిత్ పా క‌ల‌యిక‌లో వ‌స్తోన్న తాజా చిత్రం కాలా. రోబో సీక్వెల్ 2.0 త‌ర్వాత ప్రారంభ‌మైన ఈ సినిమా 2.0 కంటే ముందుగానే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. సంతోష్ నారాయ‌ణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర తమిళ ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం రాత్రి చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా రజినీ మాట్లాడుతూ.. ఇది ఆడియో లాంచ్ ఫంక్షన్‌లా లేదు.  ఫిల్మ్ సక్సెస్ మీట్‌లా ఉందని అన్నారు. కాలా రాజకీయ నేపథ్య చిత్రం కాదు.. కాకపోతే సినిమాలో రాజకీయాలు ఉంటాయని  చెప్పారు. 
 
అస‌లు ఈ సినిమా ఎలా స్టార్ట్ అయ్యిందో చెబుతూ... క‌బాలి తరవాత ఓ సినిమా చేయాలని చూస్తోన్న సమయం అది. చాలా స్క్రిప్టులు విన్నాను. అన్నీ పొలిటికల్ స్టోరీలే. అప్పటికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన నాకు లేదు. అప్పుడొచ్చాడు రంజిత్. ముంబైలోని ధరవిలో ఉంటున్న ప్రజల గురించి ఒక కథ చెప్పాడు. ముంబై వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి ‘కాలా’ అనే స్క్రిప్టుతో తిరిగొచ్చాడు. అప్పుడు రంజిత్‌తో నేనో మాటన్నాను. 
 
కబాలి నీ సినిమా, కానీ కాలా మన సినిమా అని. సమాజం కోసం ఏమైనా చేయాలనే తపన ఉన్న వ్యక్తి రంజిత్’ అని దర్శకుడిని పొగడ్తలతో ముంచెత్తారు రజినీ. ఇది ఆడియో రిలీజ్ ఫంక్షన్ కాబట్టి ఇంతకుమించి సినిమా గురించి ఏమీ చెప్పలేను. మరి ముఖ్యంగా, సినిమాను మరీ ఎత్తేస్తూ చెప్పకూడదనేది నా ఉద్దేశం. సినిమాలో నానా పటేకర్ నటన అద్భుతం. ఆయనతో కలిసి నటించడం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. 
 
‘భాషా’లో రఘువరన్, ‘పడయప్ప’ (తెలుగులో నరసింహ)లో రమ్యకృష్ణ తరవాత మళ్లీ ఓ బలమైన ప్రతినాయకుడిని ఎదుర్కొన్నాను’ అని రజినీకాంత్ చెప్పారు. తమిళనాడుకి మంచి రోజులు రాబోతున్నాయని, త్వరలోనే తన నుంచి కొన్ని ప్రకటనలు వెలువడతాయని పొలిటికల్ పార్టీ అనౌన్స్‌మెంట్ గురించి ర‌జ‌నీ చెప్ప‌క‌నే చెప్పారు. దీంతో అభిమానులు ఆనందానికి అవ‌ధులు లేవ‌నే చెప్ప‌చ్చు. మ‌రి..ఆ ఎనౌన్స్‌మెంట్ ఏమిటో...? ఎప్పుడు చేస్తారో..?