సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 20 మే 2018 (14:37 IST)

పవన్ బస్సు యాత్ర ప్రారంభం.. 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. జనసేనాని

ప్రత్యేకహోదా నినాదం, విభజన హామీల అమలుకై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి పవన్ తన యాత్ర ప్రారంభించారు. రోజుకు రెండు

ప్రత్యేకహోదా నినాదం, విభజన హామీల అమలుకై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి పవన్ తన యాత్ర ప్రారంభించారు. రోజుకు రెండు నియోజకవర్గల్లో పవన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇందులో  విద్యార్థులు నిపుణులతో కలిసి చర్చలో పాల్గొంటారు.
 
తొలిరోజు ఇచ్చాపురం, కవిటి, వరివంక, శ్రీరాంపురం, కంచిలీ, సొంపేట, బారువాల మీదుగా బస్సు యాత్ర సాగనుంది. అంతకుముందు, కవిటి మండలంలోని కాపాసుకుద్దిలో పవన్ సముద్ర స్నానం చేశారు. గంగమ్మకు ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా మత్స్యకార మహిళలు పవన్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం మత్స్యకార మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
జనసేన పార్టీకి ప్రజల సమస్యలే ఎజెండా అన్నారు. ప్రజాసమస్యలపై అవగాహన కోసమే బస్సు యాత్రను ప్రారంభించినట్లు పవన్ స్పష్టం చేశారు. ఈ బస్సు యాత్ర రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. ఇతర రాజకీయపార్టీలతో తమ పార్టీని పోల్చవద్దని, ఇతర పార్టీల నాయకులు పదవుల కోసం తపిస్తే.. తాము ప్రజా సమస్యల పరిష్కారం కోసం తపిస్తామని చెప్పారు.