శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 22 మే 2018 (13:35 IST)

తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి - పవన్ కళ్యాణ్‌

తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్‌. గత నాలుగు రోజులుగా టిటిడి వ్యవహారంపై ప్రసార మాధ్యమాల్లో గంటల తరబడి చర్చ నడుస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్వామివారి ఆభరణాలు కనిపించడం లేదన

తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్‌. గత నాలుగు రోజులుగా టిటిడి వ్యవహారంపై ప్రసార మాధ్యమాల్లో గంటల తరబడి చర్చ నడుస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్వామివారి ఆభరణాలు కనిపించడం లేదని, కోట్ల రూపాయల వజ్రాలు కనిపించకుండా పోయాయని రమణదీక్షితులు చెబుతున్నా ఎందుకు ఇంతవరకు ఆ వ్యవహారంపై విచారణ జరిపించలేదని ప్రశ్నించారు.
 
రమణ దీక్షితులు చేసిన ఆరోపణలన్నింటిపై వెంటనే విచారణ జరిపించాలని, శ్రీవారి నగలు, ఆభరణాలు ఎన్ని ఉన్నాయో వాటినన్నింటిని భక్తులకు చూపించాలని, స్వామివారి ప్రతిష్ట దిగజారకుండా, ఆలయ పవిత్రత దెబ్బతినకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తిరుమల వ్యవహారంపై మొదటిసారి పవన్ కళ్యాణ్‌ స్పందించడం చర్చకు దారితీస్తోంది.