గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 21 మే 2018 (19:40 IST)

దుర్మార్గపు ఆలోచనతోనే ప్రజారాజ్యంలో చేరా - కృష్ణంరాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యాం పార్టీ (పీఆర్పీ) గురించి బీజేపీ నేత, టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. తను విధిరాతను ఎక్కువగా నమ్ము

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యాం పార్టీ (పీఆర్పీ) గురించి బీజేపీ నేత, టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. తను విధిరాతను ఎక్కువగా నమ్ముతానని, మన టైమ్ బాగుండనప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఎవరూ చేరొద్దని చెప్పానని, కానీ, అదే పార్టీలో తాను చేరానని, ఆపై కొన్ని రోజులకే రాజీనామా చేశానని అన్నారు. 
 
అప్పట్లో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో ప్రజారాజ్యం పార్టీలో చేరితే మళ్లీ ఎంపీ అవ్వ‌చ్చు అనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. అసలు, అప్పుడేమి జరిగిందో తనకు అర్థం కాలేదని, ఎంపీ అయిపోవాలనే దురుద్దేశం, దుర్మార్గపు ఆలోచనలతోనే ఆ పార్టీలో చేరాల్సి వచ్చిందన్నారు. 
 
కాగా, నాడు ప్రజారాజ్యం పార్టీలో చేరటానికి ముందు బీజేపీలో కృష్ణంరాజు ఉన్నారు. కేంద్రమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో బీజేపీకి గుడ్ బై చెప్పిన కృష్ణంరాజు.. ‘ప్రజారాజ్యం’లో చేరిన కొన్నిరోజులకే బయటకు వచ్చేశారు. ప్ర‌స్తుతం కృష్ణంరాజు బీజేపీలో ఉన్నారు.