శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Updated : సోమవారం, 21 మే 2018 (17:01 IST)

నాకున్న వీక్‌నెస్ అదే కాబట్టి ఫోన్ కట్ చేస్తారు... తమన్నా(video)

మిల్కీ బ్యూటీ ఈమధ్య సినిమాల కన్నా స్నేహితులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోందట. ఎప్పుడూ చేతిలో సినిమాలతో బిజీగా ఉండే తమన్నా.. ప్రస్తుతం రోజుకు కనీసం మూడుగంటల సేపు తన స్నేహితురాళ్ళతో గడుపుతోందట. తమన్నాను క

మిల్కీ బ్యూటీ ఈమధ్య సినిమాల కన్నా స్నేహితులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోందట. ఎప్పుడూ చేతిలో సినిమాలతో బిజీగా ఉండే తమన్నా.. ప్రస్తుతం రోజుకు కనీసం మూడుగంటల సేపు తన స్నేహితురాళ్ళతో గడుపుతోందట. తమన్నాను కలవాలంటే చాలా కష్టం అని స్నేహితురాళ్ళు చెప్పుకునే అవసరం ఇప్పుడు లేదని చెబుతోంది మిల్కీ బ్యూటీ. ఎందుకంటే వారినే వెతుక్కుని మరీ వెళుతోంది కాబట్టి. ఇదంతా పక్కన పడితే తమన్నా మాత్రం తను నటించిన సినిమాలో తన పాత్ర గురించి తనకన్నా స్నేహితులు చెబితేనే ఎక్కువగా నమ్ముతుందట.
 
తమన్నా ఆ సినిమాలో నీకు ఆ క్యారెక్టర్ చాలా బాగుంది అని స్నేహితులు చెబితేనే ఆనందంగా వారిని కౌగిలించుకుంటుందట. మరీ ఎక్కువగా ఆనందంలో ఉంటే ముద్దులుగా పెట్టేస్తుందట. నేను సినిమాల్లో నటించడం ప్రారంభించినప్పటి నుంచి నాకు తెలుగు, తమిళ సినీపరిశ్రమలో కొంతమంది బాగా దగ్గరయ్యారు. అందులో యువతులే ఎక్కువ. నేను ఒక సినిమాలో నటించినప్పుడు ఆ సినిమాలో నా క్యారెక్టర్ ఎలా చేశాను.. ఎక్స్‌పోజింగ్ ఎక్కువగా చేశానా.. లేకుంటే సరిగ్గా చేయలేకపోయానా.. ఇలా ప్లస్, మైనస్‌లను అడిగి తెలుసుకుంటాను అంటోంది తమన్నా. 
 
ఒక్కోసారి నన్ను నా స్నేహితురాళ్ళే తిట్టుకుంటారు. కానీ నాకున్న వీక్‌నెస్ అదే కాబట్టి నాకు సమాధానం చెప్పిన తరువాత ఫోన్ కట్ చేస్తారంటోంది తమన్నా. వారు ఇచ్చిన సలహాకు నేను అప్పుడప్పుడు ట్రీట్ కూడా ఇస్తానని చెబుతోందట తమన్నా. అలా తన స్నేహితురాళ్ళు తనను వాడేసుకుంటున్నారని కూడా తమాషాగా ట్విట్టర్‌లో అప్పుడప్పుడు ట్వీట్ చేస్తోందట.  నా నువ్వే చిత్రం కోసం తమన్నా డ్యాన్స్  ప్రాక్టీస్ చూడండి