శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 10 మే 2018 (16:18 IST)

''సైరా'' కోసం తమన్నా కత్తిపట్టింది.. ''రేసుగుర్రం'' సీక్వెల్‌కు బన్నీ రెడీ..

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా రేసుగుర్రం. 2014లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. 2014లో

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా రేసుగుర్రం. 2014లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. 2014లో ఘన విజయం సాధించిన ఈ సినిమా.. బన్నీ మేనరిజానికి పక్కాగా సెట్ అయ్యింది. అలాంటి ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అల్లు అర్జున్ వున్నాడట. 
 
మొదటి సినిమాకి కథాపరమైన కొనసాగింపుగా కాకుండా, మరో కోణంలో కథ ఉంటే బాగుంటుందని అల్లు అర్జున్ అనుకుంటున్నాడట. ప్రస్తుతానికి సురేందర్ రెడ్డి.. 'సైరా' సినిమాతో బిజీగా వున్నాడు. ఆ ప్రాజెక్టు పూర్తయిన తరువాత 'రేసుగుర్రం' సీక్వెల్ పట్టాలెక్కనున్నట్టు చెబుతున్నారు. 
 
ఇక సైరా సంగతికి వస్తే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేశారట. ఈ రోల్ కోసం తమన్నా కత్తి పట్టనుంది. ఈ సినిమాలో 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' కోసం ప్రాణాలను అర్పించే వీరనారిగా తమన్నా కనిపించనుంది.
 
ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం తమన్నా కత్తి పట్టిందట. ఇంకా గుర్రంపై స్వారీ చేస్తూ తమన్నా కత్తియుద్ధం చేయనుంది. ఈ సన్నివేశాలు ప్రేక్షకుల్లో విజిల్స్ వేయించేలా వుంటాయని చెప్తున్నారు.