మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (12:38 IST)

"నా పేరు సూర్య".. ఫస్టాఫ్‌లో ఇరగదీసిన అల్లు అర్జున్... మూవీ రివ్యూ (Allu Arjun Funny Comments Video)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. బన్నీ తొ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. బన్నీ తొలిసారి ఆర్మీ అధికారి పాత్రలో నటించారు. శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ చిత్రం ఫస్టాఫ్‌ పూర్తయింది. మరి ఫస్ట్‌హాఫ్‌ ఎలా ఉందంటే...
 
కథ : 
సూర్య(అల్లు అర్జున్‌) భారత ఆర్మీలో సైనికుడిగా పని చేస్తుంటాడు. కోపం ఎక్కువ. చిన్న తప్పు జరిగినా తట్టుకోలేని మనస్తత్వం. హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి సరిహద్దులకు వెళ్లి దేశసేవ చేయాలన్నదే ఆయన లక్ష్యం. ఇంతలో పై అధికారులకు తెలియకుండా ఒక ఉగ్రవాదిని కాల్చి చంపేస్తాడు. దీంతో సైనిక నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన సూర్యను ఆర్మీ నుంచి బయటకు పంపించాలని కల్నల్‌(బొమన్‌ ఇరానీ) నిర్ణయిస్తాడు. 
 
కానీ, అందుకు ఒప్పుకోని సూర్య తన గాడ్‌ ఫాదర్‌(రావురమేష్‌)ను రంగంలోకి దింపుతాడు. అంతా బాగానే ఉందని వైజాగ్‌లో ఉన్న సైకియాట్రిస్ట్‌ రఘురామ కృష్ణంరాజు(అర్జున్‌) దగ్గర సంతకం తీసుకొస్తే బోర్డర్‌కు పంపుతానని కల్నల్‌ చెబుతాడు. రామకృష్ణంరాజు 21 రోజుల సమయం ఇచ్చి, కోపం తగ్గించుకుని రమ్మని సూర్యకు చెబుతాడు. మరి ఆ ఛాలెంజ్‌లో సూర్య నెగ్గాడా? అతను బోర్డర్‌కి వెళ్లాడా? రఘురామ కృష్ణంరాజుకు సూర్యకు ఉన్న బంధం ఏంటి? అనేదే 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' పూర్తి కథ. 
 
కోపాన్ని అదుపులో పెట్టుకోలేని ఓ సైనికుడి కథ ఇది. అల్లు అర్జున్‌ ఆ పాత్రలో ఇమిడిపోయారు. సూర్య పాత్ర కోసం బన్ని మారిన తీరు అభిమానులను సైతం ఆశ్చర్య పరుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ పాత్రను తీర్చిదిద్దిన విధానం సరికొత్తగా ఉంది. ఇక తొలి భాగంలో ట్రైలర్‌లలో చూపించినట్లు యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. 
 
ఆర్మీ ట్రైనింగ్‌ సన్నివేశాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. పాత్ర కోసం బన్ని పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా ప్రారంభమవడమే హైపిచ్‌లో మొదలవుతుంది. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా, విరామం సమయానికి మళ్లీ కథలో వేగం పెరుగుతుంది. విరామానికి ముందు వచ్చే ఫైట్‌ సీన్‌ హైలైట్‌గా నిలిచింది.