సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 మే 2018 (11:23 IST)

అల్లు అర్జున్ 'సైనిక' వీడియో సాంగ్ (Full Video Song)

మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వ‌క్కంతం వంశీ తెర‌కెక్కించిన‌ చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం ఈనల నాలుగో తేదీన విడుదలైంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది

మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వ‌క్కంతం వంశీ తెర‌కెక్కించిన‌ చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం ఈనల నాలుగో తేదీన విడుదలైంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో బన్నీ మిలిటరీ సైనికుడిగా నటించాడు. అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌. యాక్ష‌న్ హీరో అర్జున్ ముఖ్య పాత్ర పోషించాడు. చిత్రానికి విశాల్‌- శేఖ‌ర్ సంగీతం స‌మ‌కూర్చ‌గా పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ని అల‌రించాయి.
 
ఈనేపథ్యంలో తాజాగా "సైనిక" అనే సాంగ్ ఫుల్ వీడియో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ముందుగా ఈ పాట లిరిక‌ల్ వీడియోని సైనికులకు అంకితమిస్తూ రిపబ్లిక్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేశారు. రామ జోగ‌య్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాట‌ని విశాల్ పాడారు. ఈ చిత్రంలో బన్నీ ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ అభిమానులని ఎంత‌గానో అల‌రించాయి. లగడపాటి శ్రీధర్, నాగబాబు ఈ చిత్రానికి నిర్మాత‌లు. మ‌రి తాజాగా విడుద‌లైన సైనిక పాట మీరు చూసి ఎంజాయ్ చేయండి.