మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 7 మే 2018 (11:39 IST)

వెంకటేష్ సరసన తమన్నా.. వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్‌కు ఛాన్స్

విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్‌ మల్టీస్టారర్ సినిమాకు హీరోయిన్లు ఖరారైయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా మెహ్రీన్, వెంకీ సరసన తమన్నాను ఖరారు చేసిన

విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్‌ మల్టీస్టారర్ సినిమాకు హీరోయిన్లు ఖరారైయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా మెహ్రీన్, వెంకీ సరసన తమన్నాను ఖరారు చేసినట్లు దర్శకుడు ట్వీట్ చేశాడు. అలాగే జూన్ మొదటివారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అదే నెలలో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు.
 
ఇదిలా ఉంటే.. విక్టరీ వెంకటేష్ చిన్నారులతో కలిసి సరదాగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రోడ్డుపై బ్యాడ్మింటన్ ఆడుకుంటున్న చిన్నారుల వద్దకు వెళ్లి తనూ వారితో జత కలిపాడు. 
 
వెంకీ తనతో బ్యాడ్మింటన్ ఆడటం అనూహ్యంగా జరిగిందని చిన్నారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని చిన్నారులు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఇంకా వెంకటేష్‌తో కలిసి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.