మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (17:41 IST)

కళ్యాణ్ రామ్ "నా నువ్వే" వీడియో సాంగ్ రిలీజ్

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం నా నువ్వే. తమన్నా కథానాయిక కాగా, ఈ వేసవిలో ఈ చిత్రం విడుదలకానుంది. నూతన దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టై

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం నా నువ్వే. తమన్నా కథానాయిక కాగా, ఈ వేసవిలో ఈ చిత్రం విడుదలకానుంది. నూతన దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరించింది.
 
ఈ చిత్రానికి లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ పనిచేస్తుండడం విశేషం. ఇటీవల చిత్రానికి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలారు. మోర్ లవ్ .. మోర్ మేజిక్ అనేది ట్యాగ్ లైన్‌నుగా ఉంచారు. కల్యాణ్ రామ్ 15వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్ర సాంగ్ టీజర్ తాజాగా విడుదల చేశారు. 
 
"చినికి చినికి" అంటూ సాగే ఈ పాట అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. కళ్యాణ్ రామ్, తమన్నాల మధ్య రొమాన్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతుంది. తొలిసారిగా తమన్నా.. కల్యాణ్ రామ్‌తో జోడీ కట్టడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. శరీత్ చిత్రానికి సంగీతం అందించారు.